AP:‘అన్న క్యాంటీన్ల పై విషం చిమ్ముతున్నారు’..మంత్రి నారా లోకేష్ ఫైర్
ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలతో దూసుకుపోతుంది
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లను ఎన్డీయే కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. తణుకు అన్న క్యాంటీన్ నిర్వహణపై ఇటీవల వైసీపీ చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. క్యాంటీన్లలో రుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. తణుకు క్యాంటీన్‌లో అడుగడుగునా అపరిశుభ్రమంటూ వైసీపీ షేర్ చేసిన వీడియో తప్పుదోవ పట్టిస్తోందని ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. స్పష్టంగా చేతులు కడుగు స్థలము అని రాసి ఉన్నా బురద చల్లేందుకు సింకులో అన్నం తిన్న ప్లేట్లను వైసీపీ మూకలు పడేశాయని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.