వ్యవస్థలను ఖూనీ చేశారు.. తప్పించుకోలేరు: మంత్రి నాదెండ్ల హెచ్చరిక

మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి నాదెండ్ల మనోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-12-17 14:17 GMT

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. క్షేత్రస్థాయిలో విచారణ చేస్తోంది. అన్నీ రకాల పరిశీలన అయిన తర్వాత చర్యలకు దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యచరణ రూపొందిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) గుంటూరు జిల్లా తెనాలి(Guntur District Tenali) పర్యటనలో వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే పేర్నినాని (Former Mla Perni Nani)గోడౌన్‌లో మాయమైన రేషన్ బియ్యం(Ration Rice)వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 243 టన్నుల రేషన్ బియ్యాన్ని దారి మళ్లించేందుకు యత్నించారని ఆరోపించారు. వ్యవస్థలను దారుణంగా ఖూనీ చేశారనేది ప్రజలు గ్రహించాలని చెప్పారు. తప్పు చేసిన వారిని వదలిపెట్టమని చెప్పారు. మరో గోడౌన్‌పైనా అనుమానం ఉందని, త్వరలోనే తనిఖీలు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, నిజాయితీగా పని చేస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. 

Tags:    

Similar News