ఒక్కరిని అరెస్టు చేసినా ఉరి వేసుకుంటా: మంత్రి
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ఒక్క వాలంటీర్ను అరెస్టు చేసినా తాను తణుకు నరేంద్ర నరేంద్ర సెంటర్లో ఉరేసుకుంటానని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ఒక్క వాలంటీర్ను అరెస్టు చేసినా తాను తణుకు నరేంద్ర నరేంద్ర సెంటర్లో ఉరేసుకుంటానని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ఎక్కడా పార్టీ కండువా వేసుకోలేదన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు దోచుకో, దాచుకో అన్నట్లుగా ఉండేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసిచ్చిందే పవన్ కల్యాణ్ చదువుతున్నారని, తణుకులో ఒక్క బెల్టుషాపు ఉందని నిరూపించిన రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.