AP News:గత వైసీపీ ప్రభుత్వం పై మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. నేడు (ఆదివారం) మంత్రి దుర్గేష్(Minister Durgesh) విశాఖపట్నంలో పర్యటించారు.

Update: 2024-10-06 08:29 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. నేడు (ఆదివారం) మంత్రి దుర్గేష్(Minister Durgesh) విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ(Department of Tourism) తీవ్రంగా నష్టపోయింది అని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విశాఖలోని యాత్రి నివాస్ నిర్మాణాన్ని(Construction of Yatri Niwas) జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఫైరయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను సమావేశం ఏర్పాటు చేసి తెలుసుకుంటామన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు రికన్స్ట్రక్షన్ పేరుతో వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారని అందువల్లనే ప్రస్తుతం పనులు నిలిచిపోయాయని చెప్పారు.

వైసీపీ చర్యలతో పర్యాటక రంగం(Tourism sector) ఆదాయాన్ని(Income) కోల్పోయే పరిస్థితి వచ్చిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో MV మా షిప్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనుల పై కేంద్రంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy Pawan Kalyan) మాట్లాడారని చెప్పారు. దీంతో కేంద్రం పెండిగ్‌లో ఉన్న పనులను సరి చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ విశాఖపట్నం నుంచి అరకు ప్రాంత సందర్శనకు వెళ్లినట్లు సమాచారం.


Similar News