లోకేష్ పాదయాత్ర అంటే ఫ్యాషన్ షో అనుకుంటున్నాడు: మంత్రి జోగి రమేష్ సెటైర్
2022 వైసీపీకి విజయనామ సంవత్సరం అయితే.. టీడీపీకి బూతుల నామ సంవత్సరం అని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: 2022 వైసీపీకి విజయనామ సంవత్సరం అయితే.. టీడీపీకి బూతుల నామ సంవత్సరం అని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. కందూకురు బహిరంగ సభలో తొక్కసలాట జరిగి 8 మంది చనిపోయి 24 గంటలు గడవక ముందే.. వెంటనే మళ్లీ మీటింగ్‌లు పెట్టి అధికార చంద్రబాబు దాహం చూపించారని విమర్శించారు. కందూకురు ఘటనకు బాధ్యతగా చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్‌కు పాదయాత్ర చేసే అర్హత లేదని అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర అంటే ఫ్యాషన్ షో అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర, దత్తపుత్రుడు బస్సు యాత్రను.. ఆంధ్రప్రదేశ్‌లో జనాలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
Also Read..