రా కదలిరా బహిరంగ సభ అట్టర్‌ప్లాప్.. మంత్రి దాడిశెట్టి రాజా
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టింస్తున్నాయి.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టింస్తున్నాయి. అభ్యర్థుల మార్పులు చేర్పులతో.. ప్రచారాలతో ఏపీ లో ఎన్నకల కళ కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రా కదిలి రా బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభ పైన మంత్రి దాడిశెట్టి రాజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రా కదలిరా బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని.. సభలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండడంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి పిచ్చిపట్టి అలా మాట్లాడుతున్నారని ఎద్ద్దేవ చేశారు.
రైతులు నష్ట పోతున్నారు.. రైతే రాజు అని మాట్లాడే చంద్రబాబు రెండు పంటల్లో ఒక్కసారి కూడా నీరు ఇవ్వలేదని.. చంద్రబాబు నాయుడు మాటల్ని ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లక్షల కోట్ల ఆస్తులను దాచుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక సంక్రాంతి తర్వాత టిడిపి మొత్తం ఖాళీ అవుతుందని.. కనీసం అభ్యర్థులు కూడా దొరకరని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి బస్‌స్టాండ్ లో చంద్రబాబు జేబులు కొట్టే వాడని ఘాటు విమర్శలు చేశారు. ఇక పది నియోజకవర్గాల నుంచి జనాలును తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబు దేనని మంత్రి ఎద్దేవా చేశారు. తుని ప్రజలకు చంద్రబాబు గురించి తెలుసనీ.. బాబుని తుని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.