Chandrababu Naidu : చంద్రబాబు ఆరోగ్యంపై బొత్స సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు ఆరోగం బాగాలేకపోతే కోర్టులో పిటిషన్ వేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Update: 2023-10-14 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి జైలులో చంద్రబాబుకు స్కిన్ అలర్జీ అయిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళనలు చెందుతున్నారు. చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఆరోగం బాగాలేకపోతే కోర్టులో పిటిషన్ వేసుకోవాలని చెప్పారు. ఇదంతా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆడుతున్న డ్రామాలని కొట్టి పారేశారు. కోర్టు అనుమతి లేకుండా వైద్యులు జైలుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంపై చట్ట పరంగా కోర్టుకు వెళ్లాలా?.. వద్దా? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్‌లో చంద్రబాబు తప్పు చేశారని, దానినెందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబుకు ఒళ్లంతా మచ్చలేనని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఆయనకు తెలిసిన విద్యలన్నీ వాడి ఇప్పటివరకూ తప్పించుకున్నారని, ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News