Rail Accident: 482 మంది తెలుగు ప్రయాణికుల్లో 267 మంది సురక్షితం

కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌లో 482 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు..

Update: 2023-06-03 13:36 GMT

దిశ, వెబ్ డెస్క్: కోరమాండల్ ఎక్స్ ప్రెస్‌లో 482 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వారందరిని ఫోన్ నెంబర్స్ ద్వారా ట్రేస్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘113 మంది పోన్లు స్విచ్ఛాప్ వస్తున్నాయి. వారి వివరాలు సేకరిస్తున్నాం. 267 మంది సురక్షితంగా ఉన్నారు. 20 మందికి గాయాలయ్యాయి. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. యశ్వంపూర్ ఎక్స్ ప్రెస్ లో 89 మంది తెలుగు ప్రయాణికులున్నారు. వారిలో 10 మంది ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఒడిశాకు 50 అంబులెన్స్‌లు పంపాం. నేవీ సహకారం తీసుకుంటున్నాం. భువనేశ్వర్‌లోని అపోలోలో బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ’ అని బొత్స స్పష్టం చేశారు.

రైలు ప్రమాదంలో ఏపీ వాళ్లు చనిపోయినట్లు సమాచారం లేదని, కొందరికి మాత్రం గాయాలయినట్లు తెలిసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  రైలు ప్రమాదంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తు్న్నామన్నారు. గాయపడ్డ వారిని భువనేశ్వర్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. జిల్లాల కలెక్టరేట్లలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని.. రెండు రైళ్లలో ప్రయాణం చేసిన వారి కుటుంబ సభ్యులు హెల్ప్ డెస్క్‌లను సంప్రదించాలని బొత్స కోరారు.

ఇవి కూడా చదవండి:

Visakha: స్వస్థలాలకు చేరిన 45 మంది తెలుగు ప్రయాణికులు  

Tags:    

Similar News