బాలుడికి జికా వైరస్... మంత్రి ఆనం కామెంట్ ఇదే..!
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో బాలుడికి జికా వైరస్ సోకిన ఘటనపై మంత్రి ఆనం స్పందించారు...
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో జికా వైరస్(Zika virus) కలకలం రేగిన విషయం తెలిసిందే. ఏడేళ్ల బాలుడికి వారం క్రితం ఫిడ్స్ వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు ఏదో వైరస్ సోకినట్లు భావించారు. వెంటనే చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడికి జికా వైరస్ సోకిన లక్షణాలు కనిపించడంతో అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) మర్రిపాడు మండలంలో పర్యటించారు. బాలుడి గ్రామానికి వెళ్లి ప్రజలను కలిశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో వైద్యుల బృందం పర్యటించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఎవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి ఆనం పేర్కొన్నారు.