Minister Anagani: ఫైళ్లు తగులబెట్టిన వారిని వదిలిపెట్టం.. మంత్రి అనగాని మాస్ వార్నింగ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె (Madanapalle) ఫైళ్ల దగ్ధం కేసు వ్యవహారం ఇవాళ శాసనమండలి (Legislative Council)ని కుదిపేసింది.

Update: 2024-11-19 06:54 GMT
Minister Anagani: ఫైళ్లు తగులబెట్టిన వారిని వదిలిపెట్టం.. మంత్రి అనగాని మాస్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె (Madanapalle) ఫైళ్ల దగ్ధం కేసు వ్యవహారం ఇవాళ శాసనమండలి (Legislative Council)ని కుదిపేసింది. ఫైళ్ల దగ్ధం వెనుక వైసీపీ (YCP) పెద్దలు ఎవరున్నారనే విషయంలో శాసనమండలి (Legislative Council)లో టీడీపీ (TDP) సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) మాట్లాడుతూ.. మదనపల్లె (Madanapalle) ఫైళ్ల దహనం కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

ఈ క్రమంలోనే ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి (Former Minister Peddireddy Ramchandra Reddy) పేరును ప్రస్తావించగా.. విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పడంలో సభలో ఇరు పార్టీల నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే మాజీ మాజీ మంత్రి పేరును సభలో ఎలా ప్రస్తావిస్తారని బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు మంత్రి అనగాని కౌంటర్ ఇస్తూ.. సీఐడీ దర్యాప్తు (CID investigation)లో తేలిన అంశాలను తాను సభకు దృష్టికి తీసుకొచ్చానని.. కేసు విషయంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News