BREAKING: ఏపీలో భారీ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీ.. ఒకేసారి 62 మంది ట్రాన్స్‌ఫర్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ మరోసారి భారీ

Update: 2024-07-20 15:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఒకేసారి ఏకంగా 62 మంది ఆఫీసర్లకు స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ, కమిషనర్‌గా శేషగిరి, టెక్స్‌టైల్ శాఖ కమిషనర్‌గా రేఖారాణి, సెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్, భూసర్వే డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు, ఏపీ మార్క్‌ఫెడ్ ఎంపీగా మంజీర్ జిలానీ, ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతిక శుక్లా, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా నిషాంత్ కుమార్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీగా గిరీష, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసస్న వెంకటేష్‌లను నియమించింది. కాగా, ప్రభుత్వం ఒకేసారి 62 మంది అధికారులను ట్రాన్స్ ఫర్ చేయడం ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News