Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్ఏఎఫ్సీ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్దాయి....

Update: 2024-02-17 10:07 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్ఏఎఫ్సీ యూనిట్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్దాయి. మంటలతో పాటు పొంగలు కూడా భారీగా అలుముకున్నాయి. ఈ ఘటనతో కార్మికులు భయంతో స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అటు ప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది అన్వేషిస్తోంది. ప్రస్తుతం ఎండలు పెరగడంతో షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేది ఎండాకాలం కావడంతో స్టీల్ ప్లాంట్‌లో ఫైర్ సెఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. 

Read More..

పోర్టు టర్మినల్ చిచ్చు..ఇద్దరు నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

Tags:    

Similar News