ఒకేసారి సెంట్రల్ జైలుకు Pawan Kalyan, Nara Lokesh, BalaKrishna.. ఏపీ పాలిటిక్స్‌లో రేపు కీలక పరిణామం..!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిధులు గోల్ మాల్ ఆరోపణ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిధులు గోల్ మాల్ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌తో ఏపీలో కొన్ని నెలలకు ముందే ఎన్నికల వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్‌పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఇరువర్గాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి తమ పార్టీ అధినేతను జైలుకు పంపడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గమంటున్నారు.
ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏసీబీ కోర్టు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు (గురువారం) చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్, నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకేసారి జైలులో కలవనున్నారు. ఈ మేరకు రేపు చంద్రబాబును కలిసేందుకు వీరు ములాఖత్‌కు పర్మిషన్ తీసుకున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు రాజమండ్రి చేరుకోనున్న పవన్, లోకేష్, బాలకృష్ణ.. మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. పవన్, లోకేష్, బాలకృష్ణ ఒకేసారి కలిసి వస్తుండటంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పెద్దఎత్తున పోలీసులను మెహరించారు. ఒకేసారి పవన్, బాలయ్య, లోకేష్ జైలుకెళ్లి చంద్రబాబును కలవనుండటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారునుంది.