దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పెట్టిన 48 గంటల గడువుకు దిగివచ్చిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్యం తొలగించిన 4,200మంది ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కాంగ్రెస్ మాట ఇస్తుందని, మీ పక్షాన కాంగ్రెస్ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఇవ్వాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచామని, ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామన్నారు. ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగి రాక తప్పదన్నారు.
Read More..
YS Jagan:‘ఆ తేడాను ప్రజలు గమనించారు’.. కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు