కుప్పంలో వైసీపీకి భారీ షాక్.. 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిక

కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది....

Update: 2024-07-31 11:19 GMT

దిశ, వెబ్ డెస్క్: కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరికీ పార్టీ జెండాలు కప్పి సాదరంగా పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీలో చేరిన నాయకులు తెలిపారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటలతోనే గడిపేశారని, గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు.


కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధులను అధిష్టానం పట్టించుకోలేదని ఆరోపించారు. కేవలం వాలంటీర్లను నమ్ముకుని నాయకులు పని చేశారని చెప్పారు. వైసీసీ సభలకు రాకపోతే పథకాలు కట్ చేస్తామంటూ లబ్ధిదారులను బెదిరించారని గుర్తు చేశారు. వాలంటీర్ల ద్వారా మీటింగులకు వస్తున్న జనాన్ని చూసి పెద్ద నాయకులంతా సంతోషపడ్డారన్నారు. పార్టీ పరిస్థితి బాగోలేదని అప్పటి ఎంపీ రెడ్డెప్పతో చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతామని తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడారని మండిపడ్డారు. కుప్పంలో  ఓ వ్యక్తి అరాచకాలకు పాల్పడ్డారని,  దాని వల్ల ఇప్పుడు వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.  గత ఐదేళ్లలో ప్రతిపక్షాన్ని వైసీపీ సర్కార్ తీవ్రంగా అవమానించిందని  మండిపడ్డారు. చంద్రబాబు కుప్పం వస్తే గలాటాలు చేయించారని టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు పేర్కొన్నారు.

Tags:    

Similar News