చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు: Gauru charita Reddy

చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే ప్రజలకు మంచి భవిష్యత్తు వస్తుందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి పేర్కొన్నారు....

Update: 2023-11-01 15:58 GMT

దిశ, కర్నూల్ ప్రతినిధి: చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే ప్రజలకు మంచి భవిష్యత్తు వస్తుందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి పేర్కొన్నారు. కల్లూరు మండలం తడకనపల్లే గ్రామంలో ఆమె భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గౌరు చరిత రెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరిగి గ్రామంలో కరపత్రాలను ఇస్తు మినీ మేనిఫెస్టో,సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తు రచ్చబండ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గౌరుచరిత రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. మధ్యంతర బెయిల్ మంజూరుతో చంద్రబాబు జైలు నుండి విడుదల కావడం సంతోషకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి సైకో జగన్‌ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News