Breaking News : కర్నూల్ లో పుట్టగొడుగుల కంపెనీలో కార్మికుల అస్వస్థత

ఏపీలోని కర్నూల్(Karnul) జిల్లాల్లో ఓ కంపెనీలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-12-05 10:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కర్నూల్(Karnul) జిల్లాల్లో ఓ కంపెనీలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కాల్వబుగ్గ వద్ద గల పుట్టగొడుగుల కంపెనీ(Masrooms Compeny)లో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీలో ఉన్న డ్రైనేజి శుభ్రం చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. కాగా యాజమన్యం స్పందించి వారిని వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. కాగా యాజమాన్యం నిర్లక్ష్యంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే కార్మికులతో డ్రైనేజి క్లీన్ చేయించడం వలనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. 


Similar News