రేషన్ బియ్యం పక్కదారి... వైసీపీ ఎంపీపీ రమేశ్ అరెస్ట్

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నంద్యాల జిల్లా వెలుగోడులో వైసీపీ ఎంపీపీ లాలం రమేశ్‌ను అరెస్ట్ చేశారు...

Update: 2024-12-01 16:38 GMT

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం(Ration rice) అక్రమ తరలింపుపై ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం(Coalition Government) పాలన సాగించినప్పటి నుంచి రేషన్ బియ్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ దాడులు నిర్వహించింది. ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా(Kakinada District)లో సముద్ర మార్గం ద్వారా వందల టన్నుల రేషన్ బియ్యం తరలింపును పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) స్వయంగా పరిశీలించి మండిపడ్డారు. పేదలకు అందాల్సిన రేషన్ రైస్ పక్కదారి పట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

ఈ ఆదేశాలతో నంద్యాల జిల్లా వెలుగోడు(Nandyala district Velugodu)లో వైసీపీ ఎంపీపీ లాలం రమేశ్‌(YCP MP Lalam Ramesh)ను అరెస్ట్ చేశారు.రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆయనపై గత నెలలోనే కేసు నమోదు అయింది. అప్పటి నుంచి పరారీ ఉన్న రమేశ్‌ను వలపన్నీ అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారంతో రమేశ్‌కు చెందిన రైస్ మిల్లులపై గత నెలలో పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా రైసు మిల్లులో రేషన్ బియ్యం నిల్వచేసినట్లు గుర్తించారు. దీంతో లాలం రమేశ్‌పై కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. తాజాగా పవన్ సీరియస్ ఆదేశాలు ఇవ్వడంతో పోలీస్ యంత్రాంగం గాలించి రమేశ్‌ను పట్టుకున్నారు. 

Tags:    

Similar News