ఉద్యోగితో చెప్పులు మోయించిన రోజా.. కర్నూలులో ఫిర్యాదు చేసిన దళిత నేతలు
మాజీ మంత్రి రోజాపై కర్నూలులో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి రోజా(Former minister Roja)పై దళిత సంఘాల(Dalit communities) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్(Bapatla Suryalanka Beach)లో ఉద్యోగి మనోహర్‌తో చెప్పులు మోయించారు. ఈ ఘటనపై అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతోంది. దీంతో దళిత సంఘాల నేతలు ధైర్యంగా ముందుకు వచ్చారు. మాజీ మంత్రి రోజాపై కర్నూలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగిని రోజా అమానించారని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.