Vijayawadaలో డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం
విజయవాడలో డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు ప్రకటించారు. ...
దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడలో డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు ప్రకటించారు. 10 వేల మందితో ఈ సమావేశం జరుపుతామని.. ఈ సమ్మేళనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సైతం ఆహ్వానించనున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రకటించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలంలో శనివారం బీసీ మంత్రులు, వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, బీసీలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహించే అంశంపై సమావేశంలో వాడీ వేడిగా చర్చించారు. అలాగే బీసీలకు మరింత లబ్ధి చేకూరేలా ఎలాంటి పథకాలు రూపొందించాలనేదానిపై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. తమది బీసీల ప్రభుత్వం అని ఆయన చెప్పారు. బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లోనూ 50 శాతం బీసీలకే ఇచ్చారని జంగా కృష్ణమూర్తి చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్.. తదితరులు హాజరయ్యారు.
READ MORE