కొడాలి నానికి గుండెపోటు.. క్లారిటీ ఇదే!
వైసీపీ ( YCP ) కీలక నేత , మాజీ మంత్రి కొడాలి నానికి ( Kodali Nani) గుండెపోటు వచ్చినట్లు ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తు

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ( YCP ) కీలక నేత , మాజీ మంత్రి కొడాలి నానికి ( Kodali Nani) గుండెపోటు వచ్చినట్లు ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని కి గుండెపోటు రాలేదని సమాచారం అందుతోంది. ఆయనకు కేవలం గ్యాస్టిక్ సమస్య చోటు చేస్తుందని ఆయన అనుచరులు, సన్నిహితులు స్పష్టం చేశారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగానే... కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొడాలి నాని ( Kodali Nani) ఆరోగ్యం చాలా బాగుందని... కేవలం గ్యాస్టిక్ సమస్య కారణంగా హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రికి ( Aig Hospital) వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. తప్పుడు సమాచారాన్ని ఎవరు నమ్మకూడదని కోరారు. కాగా ఇవాళ ఉదయం నుంచి కొడాలి నాని కి గుండెపోటు అంటూ... అన్ని మీడియా చానల్స్ లో వార్తలు వచ్చాయి. గతంలో కూడా కొడాలి నాని కి క్యాన్సర్ అని ప్రచారం కూడా చేశారు. అప్పుడు నేరుగా కొడాలి నాని.... టిడిపికి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కొడాలి నాని కి గుండెపోటు అనగానే... ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే ఆయన ఆరోగ్యం పై నాని అనుచరులు క్లారిటీ ఇవ్వడంతో.. వైసీపీ శ్రేణులు రిలాక్స్ అయ్యాయి.