Breaking: వైసీపీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. ...

Update: 2023-06-15 11:33 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన బోటు నది మధ్యలో నిలిచిపోయింది. ఎమ్మెల్యేతోపాటు ఇతర అధికారులు సైతం అదే బోటులో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు. ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరుకు కృష్ణా నదిపై బోటులో ప్రయాణించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణా నదిలో బోటులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు ప్రయాణించారు.

అయితే బోటు కృష్ణా నది మధ్యలోకి వెళ్లే సరికి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో నది మధ్యలోనే బోటు నిలిచిపోయింది. అయితే అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బోటు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు మరో బోటును ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే, ఇతర అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News