Breaking: తగ్గిన వరద .. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్‌లో వాహన రాకపోకలు యథావిథిగా ప్రారంభమయ్యాయి...

Update: 2024-09-02 14:29 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్‌లో వాహన రాకపోకలు యథావిథిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగి రోడ్డుపై వరద నీరు ప్రవహించింది. దీంతో రెండు వైపులా వాహన రాకపోకలను నిలిపివేశారు. తాజాగా హైవేపై వరద నీరు తగ్గింది. దీంతో వాహన రాకపోకలకు అనుమతించారు. అయితే రోడ్డుపై బురద పేరుకు పోవటంతో వాహనాలను నెమ్మదిగా ఆ ప్రాంతం నుంచి దాటిస్తున్నారు. 


Similar News