Amaravati: రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం వేగం పెంచింది..

Update: 2024-10-30 16:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP capital Amaravati) నిర్మాణంపై ప్రభుత్వం వేగం పెంచింది. నిర్మాణంలో ఏఐ టెక్నాలజీ(AI technology)ని వాడుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారాయణ(Minister Narayana) కీలక ప్రకటన చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర రాజధాని నిర్మాణ డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. అమరావతి అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని తెలిపారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకూ ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. పాత టెండర్ల కాలపరిమితి ముగియడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి సీఆర్డీఏ ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి పనులు మొదలు పెడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.


Similar News