Perni Nani: జగన్, షర్మిల ఆస్తుల వివాదం.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తన సోదరి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు...

Update: 2024-10-25 13:16 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YCP chief Jagan Mohan Reddy), తన సోదరి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల(Congress state president Sharmila) మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వింత బంధాలను ఏపీలో చూస్తున్నామని సెటైర్లు వేశారు. తన ఆస్తులను మనవళ్లు, మనవరాళ్లకు రాసివ్వాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) అనుకున్నారని షర్మిలనే చెప్పారని ఆయన తెలిపారు. వైఎస్ బతికి ఉన్నప్పుడే చాలా ఆస్తులు రాసిచ్చారని పేర్ని నాని తెలిపారు. సాక్షి జగతి(Sakshi Bharati), భారతి సిమెంట్ కంపెనీలు (Bharti Cement Companies) జగన్ స్థాపించినవి పేర్ని నాని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జగన్ ఆ సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయా కంపెనీల్లో షర్మిల, ఆయన భర్త అనిల్ డైరెక్టర్లుగా లేరన్నారు. కేసుల్లో జగన్ మాత్రమే జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. భారతి సిమెంట్ పేరుపై అప్పుడెందుకు షర్మిల అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కోడలి పేరుపై కంపెనీ పెడితే ఎవరూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. జగన్ కాపలాదారుడే అయితే షర్మిల పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు.

సండూర్ పవర్‌(Sandur Power)లో వాటా ఇచ్చారని షర్మిల చెప్పారని, మరి మిగిలిన ఆస్తులు ఎందుకు రాయవ్వలేదని పేర్నినాని నిలదీశారు. వాటాల విషయంలోనే రాజశేఖర్ రెడ్డి బొమ్మ గుర్తుకు వస్తుందని విమర్శించారు. చంద్రబాబు, సోనియాతో కలిసి తిరిగే సమయంలో వైఎస్ ఆశయాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టారో అందరూ చూశారని, రాజశేఖర్ రెడ్డి అభిమానులు రాజకీయంగా చంద్రబాబును ఇప్పటికీ ద్వేషిస్తున్నారని పేర్ని నాని తెలిపారు.


Similar News