విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృటిలో తప్పిన ప్రమాదం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృటిలో ప్రమాదం తప్పింది....
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృటిలో ప్రమాదం తప్పింది. ఓం టర్నింగ్ ఎదురుగా కొండ భాగాన చెత్తకు నిప్పంటుకుంది. దీంతో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ ఫైర్ సిబ్బంది మంటలార్పారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఘాట్ రోడ్డు దిగువ వద్ద ఫైర్ ఇంజిన్‌లో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో ఎదురుగా భక్తులతో బస్సు వెళ్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించారు. కుడి వైపు డివైడర్ పైకి ఫైర్ ఇంజిన్‌ను ఎక్కించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై తృటిలో తప్పిన ప్రమాదం
— Gulte (@GulteOfficial) March 10, ౨౦౨౪
ఓం టర్నింగ్ ఎదురుగా కొండ భాగాన చెత్తకు నిప్పంటుకోవడంతో వ్యాపించిన మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్.
మంటలు ఆర్పిన అనంతరం ఘాట్ రోడ్డు దిగువకు వెళ్తున్న క్రమంలో ఫైర్ ఇంజన్ కు ఫెయిల్ అయిన బ్రేక్ లు.
ముందు భక్తులతో బస్సు… pic.twitter.com/PJvE8geBg4Read More..
టీడీపీది ఆ రెండు రాష్ట్రాల కాపీ మేనిఫెస్టో: CM జగన్ సంచలన వ్యాఖ్యలు