AP:మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
దిశ ప్రతినిధి,కృష్ణా:గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.