Breaking: జనసేన ఆవిర్భావ సభకు ఆంక్షలు.. చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక
జనసేన పార్టీ ఆవిర్భావ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తుంటే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు..
దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ ఆవిర్భావ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తుంటే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారిలోని సుమ కన్వెన్షన్ సెంటర్ పక్కన 34 ఎకరాల్లో సభ వేదికకు జనసేనికులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఝలక్ ఇచ్చారు. మచిలీపట్నంలో ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 14న జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ -30 అమల్లో ఉందని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు పోలీసుల తీరుపై జనసేన నేతలు భగ్గుమంటున్నారు. అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చి తీరా సమయం దగ్గరకు వచ్చే సరికి ఆంక్షలు విధించారని మండిపడుతున్నారు. సభను ఎలాగైనా సరే విజయవంతం చేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.