ఎన్టీఆర్‌ను లోకేశ్ టీడీపీలోకి రమ్మనడం విచిత్రం: Vallabhaneni Vamsi

తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌‌కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆహ్వానించడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనదైన స్టైల్‌లో స్పందించారు...

Update: 2023-02-25 15:26 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌‌కు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆహ్వానించడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనదైన స్టైల్‌లో స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ అడగటం విచిత్రంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది నందమూరి తారకరామారావు జూనియర్ ఎన్టీఆర్ తాత అని చెప్పారు. అంతేకానీ లోకేశ్ తాత ఖర్జూర నాయుడుది కాదని అని కౌంటర్ ఇచ్చారు. తాత పార్టీ ఆయన సొంతమని, లోకేశ్‌కు ఏం సంబంధమని వల్లభనేని వంశీ నిలదీశారు. అసలు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి పిలవడానికి లోకేశ్ ఎవరంటూ మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు నాయుడు తనను పశువుల డాక్టర్ అని పదేపదే అంటున్నాడని, తాను కూడా అదే రీతిలో స్పందిస్తే బోరున ఏడుస్తారంటూ సెటైర్లు వేశారు. గన్నవరం వచ్చి దమ్ముంటే చూసుకుందామని, పోలీసులను పక్కనపెట్టి రండి అని రంకెలు వేస్తున్నాడని మండిపడ్డారు. అంత సరదా ఉంటే తేల్చుకుందాం రావాలంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు.

Tags:    

Similar News