తిరుమల లడ్డూ వివాదం.. పొన్నవోలుకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
తిరుమల లడ్డూపై వ్యంగంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు....
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ (Srivari Laddu)పై వ్యంగంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పొన్నవోలు మదమెక్కిన మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే రోడ్డపైకి లాగుతామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మరోసారి వ్యంగ్యంగా మాట్లాడొద్దని చెప్పారు. తప్పు జరిగితే మౌనంగా ఉండాలని, పొగరుగా మాట్లాడొద్దని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తప్పు చేసి వైసీపీ నాయకులు రివర్స్ మాట్లాడుతున్నారని, మౌనంగా ఉండకుండా పొగరుగా మాట్లాడుతున్నారని పవన్ మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందువులనే దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయన్నారు. సెక్యూరిజం అంటే రెండు మార్గాలుగా చూడాలని పవన్ కల్యాణ్ సూచించారు. తాను ఏ మతంపై అసభ్యకరంగా మాట్లాడలేదని, తిరుమల(Tirumala) లడ్డూ అపవిత్రంపై మాట్లాడితే తప్పేంటని నిలదీశారు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేస్తే తాను మాట్లాద్దా అని పవన్ ప్రశ్నించారు. సనాతన ధర్మం(Sanathana Dharmam) జోలికి రావొద్దని, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.