Gannavaram నియోజకవర్గంపై చంద్రబాబు కీలక నిర్ణయం.. బాధ్యతలు ఆయనకే..!
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తున్నారు...
దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న విధ్వంసం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోవైపు నియోజకవర్గ ఇన్‌చార్జి లోటు ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గ ఇన్‌చార్చి బచ్చుల అర్జునుడు అనారోగ్యానికి గురవ్వడంతో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం పార్టీ బాధ్యతలను మాజీ ఎంపీ కోనకళ్ళ నారాయణకు అప్పగించారు. గన్నవరంలో చోటుచేసుకున్న సంఘటనలో నాయకత్వ లోపం కారణంగా నే దాడులు జరిగాయన్న భావనలో ఉన్న చంద్రబాబు నియోజకవర్గ భాధ్యతలను కోనకళ్ళకు అప్పగించారు.
అయితే కోఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా అర్జునుడు కుమారుడు బచ్చుల సుబ్రమణ్యంతోపాటు జాస్తీవెంకటేశ్వరావు, దయాల రాజేశ్వరరావు , ఆరుమళ్ళ వెంకట కృష్ణారెడ్డి , గోడ్డల్ల చిన్న రామారావులను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు విడుదల చేశారు.