వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై.. లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిక
కృష్ణా జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది...
దిశ, వెబ్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (Ysr Congress Party) షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీని వీడారు. ఇంకా చాలా మంది పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలింది. జగ్గయ్యపేట (Jaggayyapeta) మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అంతా సైకిల్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సమక్షంలో రాఘవేంద్ర పసుపు జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారందరిని లోకేశ్ సాదరంగా టీడీపీలోకి (Tdp) ఆహ్వానించారు. వైసీపీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Party) చేరుతున్నారని నారా లోకేశ్ తెలిపారు. సమిష్టిగా పని చేసి జగ్గయ్య పేట మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.