ఉగ్ర నరసింహుని రూపంలో అరుదైన పీత..ఎక్కడంటే?
కృష్ణా జిల్లా వడ్లగరువు గ్రామంలో అరుదైన పీత లభ్యమైంది. దీని వీపు పైన ఉగ్ర నరసింహుని ముఖ ఆకారం ఉంది.
దిశ ప్రతినిధి,కృష్ణా:కృష్ణా జిల్లా వడ్లగరువు గ్రామంలో అరుదైన పీత లభ్యమైంది. దీని వీపు పైన ఉగ్ర నరసింహుని ముఖ ఆకారం ఉంది. కిలో పది గ్రాముల బరువు ఉంది. రొయ్యల పెంపకందారుడు నాగ శ్రీను మాట్లాడుతూ ఎప్పటినుంచో అంతర్వేది స్వామి దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నామని, ఇప్పుడు ఆ స్వామి ఈ రూపంలో కటాక్షించినట్లు ఆనందం వ్యక్తం చేశారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 వేలపైనే ఉంటుందని, కానీ..విక్రయించదులుచుకోలేదని చెప్పారు. నదిలో లేదా సముద్రంలో వదులుతామని తెలిపారు.