NTR పొలిటికల్ ఎంట్రీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ మీడియాతో

Update: 2024-03-09 14:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ మీడియాతో ఛానెల్‌తో మాట్లాడుతూ.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఇబ్బంది ఉండకూడదనే టీడీపీలో ఎన్టీఆర్‌ను తొక్కేశారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాల్లోకి మాత్రం వస్తాడని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నారో లేదో చంద్రబాబునే అడగాలని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపైన నాని స్పందించారు. ఎన్నిలకు ఒంటరిగా వెళ్తే ఏం అవుతుందో పవన్ కల్యాణ్‌కు తెలుసని ఎద్దేవా చేశారు.

డిపాజిట్ లేని పార్టీ అనిపించుకోకుండా ఉండటానికే బీజేపీ ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుందని సెటైర్ వేశారు. 20-30 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అనిపించుకోవడమే చంద్రబాబు లక్ష్యమని ఎద్దేవా చేశారు. మూడు పార్టీలను కలిసిన జగన్‌ను ఏం చేయాలేవని అన్నారు. మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెండవ సారి సీఎం అవుతారని నాని జోస్యం చెప్పారు. తనకు కూడా ఇవే చివరి ఎన్నికలని.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కొడాలి నాని స్పష్టం చేశారు. తన కూతుళ్లకు కూడా రాజకీయాలపై ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. 

Tags:    

Similar News