‘జగన్ ప్రమాణస్వీకార తేదీలో మార్పు ఉండదు’
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పకుండా మళ్లీ రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని రేంజ్‌లో సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంత మంది కలిసి వచ్చినా.. ఎన్ని కూటములు ఏర్పడినా జగన్‌ను ఓడించడం సాధ్యం కాదని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ నేతలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ప్రత్యర్థి పార్టీ వాళ్ల ఆటలు సాగనివ్వకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే మనల్ని గెలిపిస్తారని అన్నారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఆయన అమలు చేసే ఉద్దేశం లేదుకనుకనే ఎలాంటి హామీలైనా ఇస్తాన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ. 26వేల డ్వాక్రా రుణాలను సీఎం జగన్ రుణ మాఫీ చేశారన్నారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏటా రూ. 70 వేల కోట్లు అవుతుందన్నారు. అదే చంద్రబాబు చెప్పే హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏటా రూ. 1.20 లక్షల కోట్లు అవుతుందని లెక్కలు చెప్పారు.