AP Deputy CM:‘టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఏపీ’.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు.

Update: 2024-12-13 08:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్(Swarnandhra@2047 Vision Document) ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌లు నాశనమయ్యాయి. మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి అని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) తనకోసం కలలు కనలేదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలలు కన్నారని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.

సైబర్ సిటీ రూపకర్త చంద్రబాబు(CM Chandrababu) అని కొనియాడారు. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం అని అన్నారు. ఆయనకు పరిపాలనలో సుదీర్ఘమైన అనుభవం ఉందన్నారు. ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం ప్రజల కోసం ఎలా చేయాలి? ఏం చేయాలి అని ఆయన ఆలోచిస్తారు అని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా మన భవిష్యత్తు బాగుంటుంది ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మేమంతా సీఎం చంద్రబాబు వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News