ఏపీ రాజకీయాల్లో కీలక ట్విస్ట్.. పవన్ పై పోటీకి సిద్ధమైన కాపు నేత..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వాతావరణం రోజు రోజు వేడెక్కుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వాతావరణం రోజు రోజు వేడెక్కుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ఓటర్లను ప్రభావితం చేసే నాయకులను తమకు మద్దతు తెలిపిందుకు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో అత్యధిక స్థాయిలో ఉన్న కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాపు జేఏసీ నేత అయిన ముద్రగడ పద్మనాభంను జనసేనలో చేర్పించేందుకు మంతనాలు జరిగాయి. ఆయన కూడా దాదాపు జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారనే వార్తలు వచ్చాయి.
కానీ చివరి నిమిషంలో ఆయన టీడీపీ, జనసేన కూటమికి భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయబోతున్న పిఠాపురం నుంచి ముద్రగడ బరిలో దించి పవన్ కల్యాణ్ ను ఓడించాలనే ఉద్దేశంతో వైసీపీ ముందడుగు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఆయనతో వైసీపీ పార్టీ నేతలు మంతనాలు కూడా జరిపినట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఇది నిజమైతే పిఠాపురంలో పవన్ కల్యాన్ కు గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముద్రగడ వైసీపీతో జతకడతారా లేక జనసేనతోనే ఉంటారో తెలియాలంటే ఆయన వైసీపీలో చేరిక, పవన్ పై పోటీ గురించి వస్తున్న వార్తలపై స్పందించాల్సి ఉంది.
Read More..
తంతే మూడు జిల్లాల అవుతల పడ్డాడు.. మాజీమంత్రిపై చంద్రబాబు ఫైర్