పవన్ కల్యాణ్ మా పార్టీలో చేరితే సీఎం పదవి.. కోరినంత డబ్బు ఇస్తానంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలో రాజకీయ వేడి పెరుగుతుంది

Update: 2024-02-26 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలో రాజకీయ వేడి పెరుగుతుంది. అధికార వైసీపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తు పెట్టున్నారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎంసీ అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో అవకాశం ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. జనసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన 40 స్థానాల్లో గెలుపొందుతుందే అవకాశం ఉందని.. ఇలా 24 సీట్లతో సరిపెట్టుకుంటే.. ఎలా అని సొంత పార్టీ నేతలు విమర్శించారు.

జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించడాన్ని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ వ్యతిరేకించారు. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ కు భారీ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని.. పవన్ కల్యాణ్ జనసేనతో వచ్చి తనతో కలిసి పని చేయాలని పాల్ పిలుపునిచ్చారు. పవన్ తనతో కలిసి వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరితే.. పవన్ కల్యాణ్‌కు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని.. అలాగే ఆయనను సీఎంను చేస్తానని మీడియా సమావేశంలో కేఎ పాల్ ప్రకటించారు.

Read More..

సీబీఎన్ ను సీఎం చెయ్యడానికి సిద్ధంగా లేము..దానికే మా ఓటు..పవన్ ఫ్యాన్  

Tags:    

Similar News