JC Prabhakar Reddy: జేసీబీలతో నేలమట్టం చేస్తాం.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్
టీడీపీ (TDP) నేత, తాడిపత్రి (Thadipathri) మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ (TDP) నేత, తాడిపత్రి (Thadipathri) మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇవాళ ఆయన యాడికి (Yadiki) వాసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆలయ కుంటను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మండిపడ్డారు. పట్టణ అభివృద్ధి కోసం అక్రమ నిర్మాణాలను జేసీబీ (JCB)లతో నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో ఆలయ కుంట భూమిలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని ఆరోపించారు. ఇళ్లు నిర్మించిన వారి దగ్గర ఏమైనా ప్రభత్వ అధికారిక రికార్డులు ఉంటే తీసుకురావాలి పిలుపునిచ్చారు. లేని పక్షంలో ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.