ఏపీలో మళ్లీ ఆ కార్యక్రమం.. పొలిట్ బ్యూరో గ్రీన్ సిగ్నల్

ఏపీలో మళ్లీ జన్మభూమి- మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు...

Update: 2024-08-08 09:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మళ్లీ జన్మభూమి- మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీపీ అధికారంలో ప్రతిసారి ఈ కార్యక్రమం కొనసాగింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి-2 కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం జరిగిన పొలిట్ బ్యూరో కార్యక్రమంలో జన్మభూమి-2 కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా  అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, రైతాంగ సంక్షేమం, ఆహార భద్రత, ప్రకృతి వ్యవసాయం, సహజ వనరులు, మానవ వనరులు విద్య, ఆరోగ్యం, గ్రామాలు, పట్టణాల్లో వౌలిక వసతులు, ఇందనరంగం, పరిశ్రమలు, ఉపాధి, సుపరిపాలన, శాంతిభద్రతలు వంటి అంశాలపై  దృష్టి సారించనున్నారు. 


ఈ జన్మభూమి-2 కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పదవులపైనా చర్చించారు. సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ జాబితా విడుదల చేసేందుకు ఇప్పటికే కసరత్తులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ పదవులు పొందేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి లిస్టులో ఎవరి పేర్లుంటాయో చూడాలి. 

Tags:    

Similar News