చంద్రబాబుకు బెయిల్ రావడంపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం అని అన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని అంతా చంద్రబాబు విడుదలను స్వాగతిద్దాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read..