Johnny Master:లైంగిక వేధింపుల ఆరోపణలు.. జానీ మాస్టర్ పై జనసేన సంచలన నిర్ణయం

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) పై సోమవారం ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

Update: 2024-09-16 10:46 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) పై సోమవారం ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనపై జానీ మాస్టర్(Johnny Master) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తనతో పాటు కొరియోగ్రఫీ చేసే ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్‌పై సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్, బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా జానీ మాస్టర్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరగా.. అతనికి కీలక బాధ్యతలు కూడా ఇచ్చింది. తాజాగా అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, పోలీసులు కేసు నమోదు చేయడంతో జనసేన పార్టీ (Janasena party) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జానీ మాస్టర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన పార్టీ లేఖను విడుదల చేసింది.


Similar News