ఎన్డీయే కూటమి విజయం ఖాయం: నాదెండ్ల మనోహర్

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం ఖాయమని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Update: 2024-03-18 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్డీయే కూటమి విజయం ఖాయమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేట బప్పూడిలో జరిగిన ఉమ్మడి సభ సక్సెస్ అయిందని తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై స్పందించారు  ధర్మ పోరాటంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. సీట్ల విషయంలో కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నాయని, వారితో పవన్ కల్యాణ్ స్వయంగా మాట్లాడతారని తెలిపారు.  ప్రజల కోసం కొన్ని సీట్లలో తాము సైతం త్యాగం చేశామని నాదెండ్ల పేర్కొన్నారు. 

కాగా చిలకలూరిపేట బొప్పూడిలో ప్రజాగళం సభ జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ సభ నిర్వహించాయి.ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొన్న ప్రసంగించారు. అయితే ప్రధాని మోడీ మాట్లాడుతుండగా పలుమార్లు పవర్ కట్ అయింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కావాలనే చేసి ఉంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు ప్రధాని మోడీ భద్రతా సిబ్బంది సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు జనసేన పార్టీ కూడా సీరియస్‌గా ఉంది. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యం కనిపించదన్నారు. ప్రధాని మోడీ హాజరైన సభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు, ఫొటోలు లేకుండా పాస్‌లు జారీ చేశారని మండిపడ్డారు. కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. ఎందుకలో చేశారో తమకు తెలియడం లేదన్నారు. ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యాలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. 

Read More..

ప్రధాని సభ అంటే అంతా ఆశామాషీనా.. కొట్టొచ్చినట్లు కనిపించిన భద్రతా లోపం 

Tags:    

Similar News