‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్ మరోసారి త్యాగం’

సీట్ల పంపకాలపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసిన తమకు ఆఫ్ట్రాల్ 24 సీట్లు కేటాయించడం ఏంటని ఆవేదన చెందుతున్నారు.

Update: 2024-02-24 16:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీట్ల పంపకాలపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసిన తమకు ఆఫ్ట్రాల్ 24 సీట్లు కేటాయించడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. కనీసం 40 సీట్లు అయినా ప్రకటించాల్సి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఈ సీట్ల పంపకాలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. శనివారం సాయంత్రం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. సీట్ల పంపకాలపై పవన్ కల్యాణ్ కూడా సంతృప్తిగా లేరని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పవన్ కల్యాణ్ మరోసారి త్యాగం చేశారని అన్నారు.

జనసేనకు 40 సీట్లు అయినా కేటాయించి ఉంటే బావుండని తమకు కూడా ఉందని మనసులో మాట చెప్పారు. జనసేన అభిమానులు సీట్ల పంపకాలపై సంతోషంగా లేరు స్పష్టం చేశారు. మొత్తంగా జనసేనకు 40 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు లేకపోతే అది గౌరవప్రదమైన పొత్తు కాదని తేల్చి చెప్పారు. మిగిలిన 57 సీట్లలో జనసేనకు 16 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. అధికారంలో భాగస్వామ్యంపై పవన్ కల్యాణ్‌కు స్పష్టత ఇవ్వాలని అన్నారు. ప్రస్తుత సీట్ల పంపకంతో ఓటు ట్రాన్స్‌ఫర్ జరుగదు అని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News