Ap News: రాష్ట్రంలో వరుస దురాగతాలు .. ఆమెపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
ఏపీలో ఆడబిడ్డల అదృశ్యంపై మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలపపక్షం, మహిళా కమిషన్.. రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యపై ఎందుకు మౌనంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఆడబిడ్డల అదృశ్యంపై మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలపపక్షం, మహిళా కమిషన్.. రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యపై ఎందుకు మౌనంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని హత్యపై స్పందించాల్సిన బాధ్యత లేదా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హోమంత్రి, మహిళా కమిషన్ ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు దురాగతం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ బాలిక తల్లిదండ్రుల ఆవేదననను పరిగణలోకి తీసుకోవాలని పవన్ సూచించారు.
విజయనగరం జిల్లా లోతుగడ్డలో దళిత బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన తనను కలిచివేసిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ, శాంతి భద్రతల స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులు చేతులను కూడా పాలకపక్షం కట్టేస్తోందని ఆరోపించారు. దిశ చట్టాలు, పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళా రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.