రోడ్డెక్కనున్న జనసేన ప్రచార రథాలు..

ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన ప్రచార రథాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు జెండా ఊపి ప్రారంభించారు

Update: 2024-02-24 17:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన ప్రచార రథాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు జెండా ఊపి ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ తరుపున ప్రచారం నిర్వహించేందుకు ఎన్ఆర్ఐ కొట్టే ఉదయ్ భాస్కర్ 25 వాహనాలను సమకూర్చారు. వీటిని మంగళగిరిలోని పార్టీ కార్యలయం వద్ద కార్యకర్తల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టే ఉదయ్ భాస్కర్ ని నాగబాబు అభినందించారు. జనసేన పార్టీ సిద్ధంతాలు ప్రజలకు చేరువ చేస్తూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయానికి దోహదపడాలని నాగబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్ సోదరులు కొట్టే వెంకట్రావ్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


Similar News