AP News : ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేసే అంశంపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు పాత పింఛన్ అమలు చేసే అంశంపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే 2004 సెప్టెంబరు 1 నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ తేదీలోపు చేరిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు మంగళవారం ప్రభుత్వ శాఖలన్నీ 2004 సెప్టెంబరు 1 నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అన్ని శాఖలు తమ నివేదికలు అందించిన వెనువెంటనే ఈనెల 14న సచివాలయంలో జరిగే భేటికి హాజరుకావాలని అధికారులకు ఆర్థిక శాఖ సూచించినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ఆదేశాలతో 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మేలు జరగనుంది. అంటే 2003 డీఎస్సీ, కానిస్టేబుళ్లు, 1999 గ్రూప్-2బ్యాచ్ ఉద్యోగులకు లబ్ధి చేరనుంది.
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం