Nagababu:‘జగన్ ఇలాగే పదికాలాలు చల్లగా ఉండాలి’.. నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

నేడు(డిసెంబర్ 21) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌(Former CM Jagan) పుట్టినరోజు.

Update: 2024-12-21 12:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: నేడు(డిసెంబర్ 21) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌(Former CM Jagan) పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జనసేన నేత(Janasena Leader) కొణిదెల నాగబాబు(Konidela Nagababu) సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

 

Tags:    

Similar News