Ap News: వైసీపీ నేతలకు జగన్ గుడ్ న్యూస్
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కీలక విభాగాల్లో మార్పులు చేర్పులు చేశారు....
- అనుబంధ విభాగాల అధ్యక్షుల ప్రకటన
- యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి
- మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత నియామకం
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కీలక విభాగాల్లో మార్పులు చేర్పులు చేశారు. పలు ఈ మేరకు రాష్ట్ర అనుబంధ విభాగాల నూతన అధ్యక్షులను ప్రకటించారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి యువజన విభాగం బాధ్యతలు అప్పగించారు. అలాగే వైసీపీ మహిళా విభాగం రాష్ట్రఅధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ, పోతుల సునీతను నియమించారు. వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎస్టీ సెల్ అధ్యక్షులిగా కొండ ప్రాంతానికి చెందిన మత్సరస వెంకటలక్ష్మి, మైదాన ప్రాంతానికి సంబంధించి మేరాజోత్ హనుమంత్ నాయక్‌లను నియమించింది. రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, వైఎస్ఆర్టీయూసీ విభాగం చైర్మన్‌గా గౌతమ్ రెడ్డి, వికలాంగుల విభాగం చైర్మన్‌గా బందెల కిరణ్ రాజులను వైసీపీ అధిష్టానం నియమించింది.
ఇక సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, ప్రచార విభాగం అధ్యక్షులుగా ఆర్.ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డిలను నియమించింది. ఇక గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, న్యాయవిభాగం చైర్మన్‌గా ఎం.మనోహర్ రెడ్డిలను నియమించింది. ఐటీ విభాగం-సునీల్ పోసింరెడ్డి, ఎన్ఆర్ఐ విభాగం చైర్మన్-మేడపాటి వెంకట్, వైఎస్ఆర్టీఎఫ్-ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎస్సీసెల్-జూపూడి ప్రభాకర్ రావు, ఎంపీ నందిగాం సురేశ్ బాబు, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ డా.మెుండితోక అరుణ్ కుమార్‌లను నియమించింది. ఇకపోతే మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా షఏక్ వీ ఖాదర్ భాషా, డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాన్సన్ మేడిది, వాణిజ్య విభాగం పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్‌లను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.