జగన్‌కు పిచ్చి ముదిరింది.. గవర్నర్ దృష్టి సారించండి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పిచ్చి ముదిరిందని ఆ పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు సూచించారు.

Update: 2023-11-03 10:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పిచ్చి ముదిరిందని ఆ పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు సూచించారు. వైఎస్ జగన్ పిచ్చి పరిపాలన ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో సెటైర్లు వేసేందుకు ఉపయోగపడుతుందని బొండా ఉమా అన్నారు. వైఎస్ జగన్ పరిపాలనను హేళన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు ఎన్నికల ప్రచారంలో జోకులు వేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల భద్రత లేకుండా, అభివృద్ధిలేని రాష్ట్రంగా బీహార్‌ను ఉదాహరణగా చూపించిన దేశం ఇప్పుడు ఏపీని చూపిస్తోందంటూ బొండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇతర సర్వేలు వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రావని తేల్చేశాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిందని.. అవినీతిపై భవిష్యత్తులో కేసులు తప్పవని భావించిన జగన్ భయంతో చంద్రబాబుపై కేసులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు రుద్ది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Tags:    

Similar News